ప్రపంచ చాంపియన్‌ లింథోయ్‌

27 Aug, 2022 05:36 IST|Sakshi

సరజెవో (బోస్నియా అండ్‌ హెర్జిగొవినా): ప్రపంచ జూడో చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి లింథోయ్‌ చనంబమ్‌ సంచలనం సృష్టించింది. క్యాడెట్‌ విభాగంలో (57 కేజీల కేటగిరీ) ఆమె విజేతగా నిలిచింది. మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల లింథోయ్‌ శుక్రవారం జరిగిన ఫైనల్లో 1–0 తేడాతో రీస్‌ బియాంకా (బ్రెజిల్‌)ను ఓడించింది.

8 నిమిషాల 38 సెకన్ల పాటు సాగిన బౌట్‌లో భారత జుడోకా సత్తా చాటింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత జూడోకా ఒకరు ప్రపంచ చాంపియన్‌ కావడం ఇదే తొలిసారి. పురుషులు లేదా మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్, క్యాడెట్‌... ఇలా ఏ విభాగంలోనూ ఇప్పటి వరకు భారత్‌నుంచి ఎవరూ విజేతగా నిలవలేదు. గత జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కేడెట్‌ జూడో చాంపియన్‌షిప్‌లో లింథోయ్‌ కూడా స్వర్ణం సాధించింది.  

మరిన్ని వార్తలు