ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో మెరుగుపడిన టీమిండియా స్థానం

29 Mar, 2021 21:08 IST|Sakshi

ముంబై: ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో టీమిండియా ఏడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత్‌.. 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 ఓటములతో 29 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ సిరీస్‌ చేజార్చుకున్నప్పటికీ.. పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మోర్గాన్‌ సారథ్యంలోని ఇంగ్లీష్‌ జట్టు 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 ఓటములతో 40 పాయింట్లు దక్కించుకొని టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది.

ఈ జాబితాలో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా(6 మ్యాచ్‌ల్లో 4గెలుపు, 2ఓటమి) కూడా 40 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్‌రన్‌రేట్‌లో ఇంగ్లాండ్‌ కన్నా వెనకబడి ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌, ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ జట్లు తలో 30 పాయింట్లు సాధించి 3 నుంచి 6 స్థానాల వరకు వరుసగా ఉన్నాయి. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్న దాయాది పాక్‌ 20 పాయింట్లతో భారత్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు బోణీ కొట్టాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాయింట్ల పట్టికలో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన జట్లు, భారత్‌ ఆతిధ్యమివ్వనున్న 2023 వరల్డ్‌ కప్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీకి ఆతిథ్యమిస్తున్నందుకు టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది.
చదవండి: భారత ఉసేన్‌ బోల్ట్‌ శ్రీనివాస గౌడ మరో రికార్డు

మరిన్ని వార్తలు