Asia Cup 2023: నేపాల్‌తో మ్యాచ్‌.. శార్ధూల్‌పై వేటు! షమీకి ఛాన్స్‌! భారత తుది జట్టు ఇదే

3 Sep, 2023 13:28 IST|Sakshi

ఆసియాకప్‌-2023లో భాగంగా సెప్టెంబర్‌ 4న నేపాల్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పసికూనపై గెలిచి సూపర్‌-4లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. కాగా శనివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన భారత తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత ఖాతాలో ఒక్కపాయింట్‌ వచ్చి చేరింది. ఈ క్రమంలో నేపాల్‌పై భారత్‌ విజయం సాధిస్తే 3 పాయింట్లతో సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది.

బ్యాటింగ్‌కు మంచి ఛాన్స్‌.. 
ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో రద్దైనప్పటికీ భారత బ్యాటింగ్‌ టాపర్డర్‌ మాత్రం తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు. వారు తిరిగి మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి నేపాల్‌తో మ్యాచ్‌ మంచి అవకాశం. నేపాల్‌పై అద్భుతమైన ప్రదర్శన చేసి ఆత్మవిశ్వాసంతో సూపర్‌-4లో ఆటగాళ్లు రాణించవచ్చు. పాకిస్తాన్‌పై టాపర్డర్‌ విఫలమైనప్పటికీ హార్దిక్‌ పాండ్యా(87) ఇషాన్‌ కిషన్‌(82) మాత్రం కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరి ఆటతీరుకు అంతా ఫిదా అయిపోయారు.

శార్ధూల్‌పై వేటు.. షమీకి ఛాన్స్‌
ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో షమీకి కాదని శార్థూల్‌ ఠాకూర్‌ రూపంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు జట్టు మెన్‌జ్‌మెంట్‌ అవకాశం ఇచ్చింది. మెనెజ్‌మెంట్‌ నమ్మకన్ని శార్ధూల్‌ నిలబెట్టకోలేకపోయాడు. బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ వచ్చినప్పటికీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో నేపాల్‌తో మ్యాచ్‌కు శార్ధూల్‌ను పక్కన పెట్టి షమీకి ఛాన్స్‌ ఇవ్వాలని జట్టు మెన్‌జెమెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నేపాల్‌తో మ్యాచ్‌కు భారత  తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌.. బుద్దిచెప్పిన హార్దిక్‌ పాండ్యా! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు