IND Vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! సూర్యకు ఆఖరి ఛాన్స్‌

21 Mar, 2023 11:02 IST|Sakshi

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఘోర పరాభావం చవి చూసిన టీమిండియా.. ఇప్పుడు కీలకమైన మూడో వన్డేకు సిద్దమైంది. బుధవారం(మార్చి 22)న చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఆఖరి వన్డేలో భారత్‌-ఆసీస్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

ఇక సిరీస్‌ డిసైడ్‌ చేసే మూడో వన్డేలో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి  దిగే అవకాశం ఉంది. వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజెమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన సుందర్‌ను, తన హోం గ్రౌండ్‌ చెపాక్‌లో ఖచ్చితంగా ఆడించాలని రోహిత్‌ శర్మ భావిస్తున్నాడట.

                               

అదే విధంగా తొలి రెండు వన్డేల్లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగిన స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజెమెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టును మూడో వన్డేకు కొనసాగించాలని ఆసీస్‌ మెనెజెమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

పిచ్‌ రిపోర్ట్‌
చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు స్వర్గదామం వంటింది. స్పిన్నర్లకు అనుకూలమైన ఈ పిచ్‌లో పరుగులు తియ్యడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ పిచ్ రెండవ ఇన్నింగ్స్‌లో చాలా నెమ్మదిగా ఉంటుంది. రాత్రి మ్యాచ్‌లో మంచు ముఖ్యమైన అంశం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు

భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ
చదవండి: టీమిండియాలో నాలా బ్యాటింగ్ చేసే ఆటగాడే లేడు.. కానీ వాళ్లిద్దరు మాత్రం!

మరిన్ని వార్తలు