‘గ్రాండ్‌మాస్టర్‌’ రాజా రిత్విక్

19 Sep, 2021 05:30 IST|Sakshi

17 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందిన తెలంగాణ కుర్రాడు

భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన 70వ చెస్‌ ప్లేయర్‌గా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి చెస్‌ క్రీడాకారుడు గొప్ప ఘనతగా భావించే గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) టైటిల్‌ హోదాను తెలంగాణ కుర్రాడు రాజవరం రాజా రితి్వక్‌ అందుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వెజెర్‌కెప్జో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) చెస్‌ టోర్నమెంట్‌లో 17 ఏళ్ల రాజా రితి్వక్‌ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ పాయింట్ల మైలురాయిని దాటాడు. బుడాపెస్ట్‌లోనే గత వారం జరిగిన టోరీ్నలో రితి్వక్‌ విజేతగా నిలిచి మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు.

అయితే అప్పటికి అతని ఎలో రేటింగ్‌ 2496గా ఉండటంతో గ్రాండ్‌మాస్టర్‌ హోదా ఖరారు కాలేదు. ఈనెల 15న మొదలైన వెజెర్‌కెప్జో టోర్నీలో 2496 ఎలో రేటింగ్‌తో బరిలోకి దిగిన రితి్వక్‌ నాలుగో రౌండ్‌లో ఫినెక్‌ వచ్లావ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో అతని ఖాతాలో ఐదు ఎలో పాయింట్లు చేరి రేటింగ్‌ 2501కు చేరింది. ఫలితంగా ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లను సాధించిన రితి్వక్‌ జీఎం టైటిల్‌ ఖరారు కావడానికి అవసరమైన 2500 రేటింగ్‌ను కూడా అందుకోవడంతో భారత్‌ తరఫున 70వ  గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాడు.

వరంగల్‌ జిల్లాకు చెందిన రాజా రిత్విక్‌ ఆరేళ్ల ప్రాయంలో చెస్‌ పట్ల ఆకర్షితుడయ్యాడు. రితి్వక్‌ తండ్రి ఆర్‌.శ్రీనివాసరావు యూనివర్సిటీ స్థాయిలో చెస్‌ ఆడారు. తొలుత వరంగల్‌లో స్థానిక కోచ్‌ బొల్లం సంపత్‌ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్‌ ఆ తర్వాత హైదరాబాద్‌లోని కె.నరసింహా రావు వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఎన్‌.వి.ఎస్‌. రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్‌ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని భవాన్స్‌ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు.  

పతకాల పంట...
2012లో కామన్వెల్త్‌ చాంపియన్‌íÙప్‌లో అండర్‌–8 విభాగంలో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రితి్వక్‌ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. 2013లో, 2015లో ఆసియా స్కూల్స్‌ టోరీ్నలో.. 2018లో ఆసియా యూత్‌ చాంపియన్‌íÙప్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2017 జూన్‌లో జాతీయ అండర్‌–13 చాంపియ న్‌íÙప్‌లో చాంపియన్‌గా అవతరించిన రిత్విక్‌ అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన జాతీయ అండర్‌–17 చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా రితి్వక్‌ ఇప్పటివరకు జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలు, రెండు రజ తాలు... అంతర్జాతీయస్థాయిలో 10 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు.  

గ్రాండ్‌మాస్టర్‌ హోదా సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్‌తో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను. 2600 ఎలో రేటింగ్‌ అందుకోవడమే నా తదుపరి లక్ష్యం. భవిష్యత్‌లో ఏనాటికైనా వరల్డ్‌ చాంపియన్‌ కావాలన్నదే నా జీవిత లక్ష్యం.   
 –రాజా రిత్విక్‌

తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్‌ అయిన మూడో ప్లేయర్‌ రిత్విక్‌. గతంలో హర్ష భరతకోటి, ఎరిగైసి అర్జున్‌ ఈ ఘనత సాధించారు.   

తెలుగు రాష్ట్రాల నుంచి గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందిన ఎనిమిదో ప్లేయర్‌ రిత్విక్‌. గతంలో పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్‌బాబు, కార్తీక్‌ వెంకటరామన్‌ (ఆంధ్రప్రదేశ్‌) ఈ ఘనత సాధించారు.   

>
మరిన్ని వార్తలు