Asia Cup 2022: పాక్‌పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత!

4 Sep, 2022 21:36 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లో 7వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.  భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్‌ శర్మ(28), కేఎల్‌ రాహుల్‌(28) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌, హార్ధిక్‌ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్‌ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్‌ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్‌ తలా వికెట్‌ సాధించారు.

పాక్‌పై భారత బ్యాటర్ల సరికొత్త చరిత్ర
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 54 పరుగులు అందించారు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ ఫలితంగా భారత్‌ పవర్‌ ప్లేలో ఒక్క వికెట్‌ కోల్పోయి 62 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీ20ల్లో పాకిస్తాన్‌పై భారత్‌ తమ అత్యధిక పవర్‌ప్లే స్కోరు నమోదు చేసింది. అంతకుముందు 2012లో పాకిస్తాన్‌పై భారత్‌ పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టపోయి 48 పరుగులు చేసింది.
చదవండి: Asia Cup 2022 IND VS PAK: చేలరేగిన కింగ్‌ కోహ్లి.. పాకిస్తాన్‌ టార్గెట్‌ 182 పరుగులు

మరిన్ని వార్తలు