ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు

13 May, 2021 17:48 IST|Sakshi

దుబాయ్‌: జూన్‌లో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న నేపథ్యంలో ఐసీసీ గురువారం టాప్‌ 10లో ఉన్న జట్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. మే 2020 నుంచి మే 2021 వరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ర్యాంకులు ఇచ్చినట్లు ఐసీసీ స్పష్టం చేసింది.  ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లను  గెలుచుకున్న టీమిండియా ఒక పాయింట్‌ సాధించి 121 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. రెండు పాయింట్లు సాధించిన న్యూజిలాండ్‌ 120 పాయింట్లతో రెండో స్థానంలో.. 109 పాయింట్లతో ఇంగ్లండ్‌ మూడు, 108 పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్నాయి.

ఇక దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై టెస్టు సిరీస్‌లను నెగ్గిన పాకిస్తాన్‌ 84 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌పై సిరీస​ గెలిచి.. లంకతో డ్రా చేసుకున్న వెస్టిండీస్‌ 84 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఏడో స‍్థానంలో నిలిచి దక్షిణాఫ్రికా చెత్త రికార్డును నమోదు చేసింది. తమ టెస్టు ర్యాంకింగ్‌ చరిత్రలో అత్యంత తక్కువ పాయింట్లతో నిలిచింది. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలు వరుసగా 8,9,10 స్థానాల్లో ఉన్నాయి. కాగా జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి కోహ్లి, రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మలు ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో నిలిచారు.   బౌలింగ్‌ విభాగంలో తొలి స్థానంలో కమిన్స్‌(908 పాయింట్లు), అశ్విన్‌ (850 పాయింట్లతో) రెండో స్థానంలో, నీల్‌ వాగ్నర్‌( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. 
చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌: అశ్విన్‌ ఒక్కడే.. పాక్‌ బౌలర్ల కెరీర్‌ బెస్ట్‌

>
మరిన్ని వార్తలు