సంచలన విజయం: నంబర్‌ 1గా టీమిండియా

19 Jan, 2021 14:16 IST|Sakshi

ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌లో సత్తా చాటిన భారత్‌

బ్రిస్బేన్‌: బోర్డర్‌– గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిం‍డియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్‌ తర్వాత న్యూజిలాండ్‌ (420), ఆస్ట్రేలియా(332) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.(చదవండి: ట్రెండింగ్‌లో టీమిండియా)

ఇక ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో సంచలన విజయం సాధించిన టీమిండియా(117.65) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో నిలిచింది. ఆసీస్‌(113 పాయింట్లు)ను వెనక్కి నెట్టి ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది. కాగా పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన న్యూజిలాండ్‌(118.44) ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విధించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో ఛేదించిన భారత్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  తద్వారా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టీమిండియా కైవసమైంది. (చదవండి: చెలరేగిన పంత్‌.. భారత్‌ సంచలన విజయం)

చదవండి :  (టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు