అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి: వీడియో వైరల్‌

30 Nov, 2020 11:15 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 389 పరుగులతో భారత్‌పై అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డును లిఖించింది. కాగా, టీమిండియా మాత్రం 338 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకోవడంతో భారత అభిమానులు కాస్త ఎక్కువగానే నిరాశకు లోనయ్యారు. కానీ ఒక భారత అభిమాని మాత్రం మంచి జోష్‌లో ఉన్నాడు. ఇందుకు కారణం తన గర్ల్‌ఫ్రెండ్‌ ప్రేమను అంగీకరించడమే. ఆస్ట్రేలియన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ తన ప్రేమను ఒప్పుకోవడంతో ఆ అభిమాని మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇందుకు సిడ్నీ గ్రౌండ్‌ వేదికైంది. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డేలో భాగంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ఓ భారత అభిమాని, తన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు.మోకాళ్లపై కూర్చొని లవ్‌ ప్రపోజల్‌ చేశాడు. (కెప్టెన్‌గా కోహ్లి చేసిన ఆ తప్పిదాలతోనే..!)

రింగ్‌ బాక్స్‌లో నుంచి రింగ్‌ ను  తీసి ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. దానికి ఉబ్బితబ్బైపోయిన ఆమె.. అతని ప్రేమను అంతే హుందాగా అంగీకరించింది. అటు తర్వాత ఇద్దరూ హగ్‌ చేసుకుని, ముద్దుపెట్టుకని తమ ప్రేమను చాటుకున్నారు.  ఈ ప్రపోజల్‌ నడుస్తున్నంత సేపు కెమెరాలు వారిపైనే ఉన్నాయి. గ్రౌండ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాక్స్‌వెల్‌ కూడా వీరి ప్రేమను చప్పట్లతో అభినందించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజ్‌లో కోహ్లి, అయ్యర్‌లు ఉన్నారు. అప్పుడే ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సన్నివేశం చోటుచేసుకుంది. దీనిని క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. (జోష్‌లో ఉన్న ఆసీస్‌కు షాక్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా