BCCI Success: టీమిండియాకు ఊరట

22 May, 2021 12:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ ముందు క్వారంటైన్‌ రోజుల్ని కుదించేందుకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఒప్పుకుంది. పదిరోజులను మూడు రోజులకు కుదిస్తున్నట్లు బీసీసీఐకి అంగీకారం తెలిపింది. ఇంగ్లాండ్‌ టూర్‌ కోసం పురుషుల, మహిళల టీంలు జూన్‌ 2న ఇంగ్లాండ్‌కు ఒకే విమానంలో బయలుదేరాల్సి ఉంది. అయితే పదిరోజుల కఠిన క్వారంటైన్‌కు రెడీగా ఉండాలని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ముందు కండిషన్‌ పెట్టింది. ఈ మేరకు భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఈసీబీతో సంప్రదింపులు జరిపింది.

చివరికి బీసీసీఐ రిక్వెస్ట్‌తో కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను ఇంగ్లాండ్‌ బోర్డు సవరించింది. ఈ నిర్ణయంతో నాలుగో రోజు నుంచే జట్లు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. అయితే క్రికెటర్లకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చిన ఈసీబీ.. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్‌ విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌లో భాగంగా జూన్‌ 18న న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన తలపడనుంది. ఇక ఉమెన్‌ టీం.. జూన్‌ 16న ఇంగ్లాండ్‌తో బ్రిస్టల్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది.
చదవండి: పుజారా ఆస్ట్రేలియన్‌ మాదిరిగానే బ్యాటింగ్‌ చేశాడు

మరిన్ని వార్తలు