India Tour Of South Africa: భారత​ టెస్ట్‌ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్‌ స్పిన్నర్‌ ఔట్‌

8 Dec, 2021 20:14 IST|Sakshi

India Test Squad | Ravindra Jadeja,Shubman And Axar Out Of South Africa Tour: దక్షిణాఫ్రికాలో పర్యటించబోయే భారత టెస్ట్‌ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. గాయం కారణంగా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లు ఈ పర్యటనకు దూరమయ్యారు.


ఫామ్‌ లేమితో సతమతమవుతున్న పుజారా, రహానేలపై సెలెక్టర్లు నమ్మకముంచారు. 18 మంది సభ్యుల రెగ్యులర్‌ జట్టులో వీరిద్దరికి చోటు కల్పించారు. ఇండియా-ఏ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇదివరకే దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లాలను స్టాండ్‌బై ప్లేయర్లుగా ప్రకటించారు. 

భారత టెస్ట్‌ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా
చదవండి: ODI Captain: కోహ్లికి షాక్‌.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ.. బీసీసీఐ అధికారిక ప్రకటన

మరిన్ని వార్తలు