IND vs AFG: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..!

28 May, 2023 13:36 IST|Sakshi

టీమిండియా అభిమానులకు ఓ బ్యాడ్‌ న్యూస్‌. ఈ ఏడాది జూన్‌లో భారత్‌, ఆఫ్గానిస్తాన్‌ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ వాయిదా వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాలని భారత క్రికెట్‌బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వర్క్‌లోడ్‌, సిరీస్‌కు బ్రాడ్‌కాస్టర్ లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

ఆసియాకప్‌, వన్డే వరల్డ్‌కప్‌ కూడా ఈ ఏడాదే ఉండడంతో.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనంతరం భారత జట్టు విండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. విండీస్ పర్యటనకు బయలుదేరే ముందు రోహిత్ అండ్‌కోకు రెండు వారాల విశ్రాంతి లభిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా రోహిత్‌ సేన రెండు టెస్టు, 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

ఈ సిరీస్‌లు అన్ని జూలైలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను, భారత జట్టును బీసీసీఐ ఒకటెండ్రు రోజుల్లో ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇక భారత పర్యటన వాయిదా పడడంతో రషీద్‌ ఖాన్‌ సారధ్యంలోని ఆఫ్గాన్‌ జట్టు బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, రెండు టీ20లు, ఏకైక టెస్టు ఆడనుంది.
చదవండి: IPL 2023: 'అతడు ఏదో పెద్ద స్టార్‌ క్రికెటర్‌లా ఫీలవతున్నాడు.. గిల్‌ను చూసి నేర్చుకో'

మరిన్ని వార్తలు