ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్‌ ఎంట్రీ

24 Sep, 2023 10:59 IST|Sakshi

తొలి వన్డేలో ఆసీస్‌పై విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఇండోర్‌ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో ఆసీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రాహుల్‌ సేన బావిస్తోంది. 

ఇక రెండో వన్డేలో భారత ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో వన్డేలో విఫలమైన శార్ధూల్‌ ఠాకూర్‌ స్ధానంలో పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణకు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. మొదటి మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఠాకూర్‌ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయాడు.

ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వినికిడి. మరోవైపు ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు పలురిపోర్టులు పేర్కొంటున్నాయి. తొలి వన్డేకు దూరమైన మాక్స్‌వెల్‌, మిచెల్‌ స్టార్క్‌, కారీ ..  ఇండోర్‌ వన్డేకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అబాట్‌, షార్ట్‌, ఇంగ్లీస్‌ బెంచ్‌కు పరిమిత మయ్యే ఛాన్స్‌ ఉం‍ది.

పిచ్‌ రిపోర్ట్‌
ఇండోర్‌ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామం. ఈ వికెట్‌పై భారీ స్కోర్లు నమోదు అవ్వడం ఖాయం. అయితే  ఈ వికెట్‌పై కాస్త బౌన్స్‌ కూడా ఉంటుంది. ఇది బౌలర్లకు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే ఛాన్స్‌ ఉంది.

తుది జట్లు(అంచనా) 
భారత్‌: శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్‌ కృష్ణ

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, కామెరాన్ గ్రీన్, అలెక్స్‌ కారీ (వికెట్‌ కీపర్‌), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), మాక్స్‌వెల్‌, ఆడమ్ జంపా

మరిన్ని వార్తలు