పంత్‌ కీలక ఇన్నింగ్స్‌.. భారత్‌ విజయం

19 Jan, 2021 08:35 IST|Sakshi

బ్రిస్బేన్ ‌:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్‌  విజయం సాధించింది. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా  ఎదుర్కుంటూ విజయానికి చేరులోకి వచ్చింది. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచి సవాల్‌ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్‌ సమాధానం చెబుతున్నారు. నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌‌ను ముందుండి నడిపించాడు.

యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.  ఆ తరువాత వచ్చిన కెప్టెన్‌ అజింక్యా రహేనే 24 పరుగులకే పెవిలియన్‌ బాట పట్టి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్‌ బౌలర్లు ధీటుగా ఎదుర్కొన్న పుజారా 211 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. దీంతో భారత్‌ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. హాఫ్‌ సెంచరీతో టీంను విజయం దిశగా నడిపిస్తున్నాడు. (ఆసక్తికర ఘట్టానికి టెస్టు సిరీస్‌)

ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 304/5. విజయానికి ఇంకా భారత్‌ 24 పరుగులు అవసరం. ప్రస్తుతం క్రిజ్‌లో పంత్‌ (71), వాషింగ్టన్‌ సుందర్‌ (21)‌ ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/73)తో చెలరేగాడు. మరో పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌కు 4 వికెట్లు దక్కాయి.

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు