టీ20 సిరీస్‌కు వరుణ్‌ దూరం! సెలక్టర్లపై విమర్శలు

9 Nov, 2020 13:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి భారత సెలక్షన్‌ కమిటీ వ్యవహారంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. తొడ కండరాలకు గాయాన్ని సాకుగా చూపి రోహిత్‌ శర్మను పక్కన పెట్టిన సెలక్టర్లు.. భుజం నొప్పితో బాధపడుతున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని టీ20 సిరీస్‌కు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేకేఆర్‌ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్‌ చక్రవర్తి భుజం నొప్పి కారణంగా ఆస్ట్రేలియా పర్యటకు దూరం కానున్నాడని ఓ స్టడీ రిపోర్టు వెల్లడించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అన్‌ఫిట్‌గా ఉన్న వరుణ్‌ని ఆసీస్‌ టూర్‌కు ఎంపిక చేశారని తెలిపింది. బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకుల మధ్య సమన్వయం లోపం కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని స్పష్టం చేసింది.

కాగా, ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా పలు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రోహిత్‌ పాల్గొనలేదు. అనంతరం ఢిల్లీతో జరిగిన ప్లేఆఫ్స్‌లో క్రీజులోకొచ్చాడు. ఐపీఎల్‌లో ఏ ఆటగాడైనా గాయపడితే నిర్వాహకులు బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని బీసీసీఐ ఫిజియో టీమ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఐపీఎల్‌లో వరుణ్‌ గాయపడినా సమాచారం ఇవ్వని ఐపీఎల్‌ నిర్వాహకులు.. అతన్ని మిగతా మ్యాచ్‌లలోనూ కొనసాగించారు. బంతిని దూరం విసరడానికి ఇబ్బందిపడ్డ వరుణ్‌ని 30 మీటర్ల సర్కిల్‌లోనే ఫీల్డింగ్‌ చేయించినట్టు స‍్టడీ రిపోర్టు పేర్కొంది. నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరుగనుంది.
(చదవండి: రేపే ఐపీఎల్‌ ఫైనల్‌.. బుమ్రా, రబడకు కూడా!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు