IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌.. రిషబ్‌ పంత్‌ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా?

4 Dec, 2022 12:38 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ దూరమయ్యాడు. అతడిని వన్డే జట్టును నుంచి విడుదల చేస్తున్నట్లు తొలి వన్డేకు ముందు బీసీసీఐ ప్రకటన చేసింది.  "బీసీసీఐ మెడికల్‌ టీమ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతే జట్టు నుంచి విడుదల చేశాం.

అతడు తిరిగి టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చేరుతాడు. అయితే వన్డే సిరీస్‌కు పంత్‌ ప్రత్యామ్నాయంగా ఎవరినీ ఎంపికచేయలేదు. అదే విధంగా మొదటి వన్డే సెలక్షన్‌కు అక్షర్ పటేల్ అందుబాటులో లేడు" అంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. పంత్ కు ఏమైందో మాత్రం  బీసీసీఐ చెప్పలేదు. 

ఇక పంత్‌ దూరం కావడంతో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌ బాధ్యతలు చేపట్టాడు. కాగా గత కొంత కాలంగా పంత్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌పై  విన్నింగ్ సెంచరీ చేసిన పంత్‌.. అనంతరం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేకపోయాడు. 

న్యూజిలాండ్‌తో జరిగిన అఖరి వన్డేలో పంత్‌ వెన్ను నొప్పితో బాధ పడ్డాడు. ఈ క్రమంలోనే పంత్‌ను జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం కావాలనే పంత్‌ను బీసీసీఐ తప్పించింది అంటూ ట్విటర్‌లో పోస్టులు చేస్తున్నారు.


చదవండి: BAN vs IND: 'ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పడు మా దృష్టి అంతా దాని పైనే'

>
మరిన్ని వార్తలు