IND Vs ENG 2nd Test: 27 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్‌

15 Aug, 2021 08:16 IST|Sakshi

► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు భారత్‌పై 27పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

► ఇంగ్లండ్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 111వ ఓవర్‌లో మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌లు వెనువెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం ఇంగ్లం‍డ్‌ 112 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.

ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌.. 
► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. రూట్‌ 151 పరుగులతో​ అజేయంగా ఆడుతుండగా.. మొయిన్‌ అలీ 27 పరుగులతో సహకరిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కంటే 24 పరుగులే వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 110 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. మూడు సెషన్‌ల పాటు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ పూర్తి ఆధిపత్యం కనబరచగా.. భారత బౌలర్లు రోజంతా కష్టపడి రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. 

రూట్‌ సెంచరీ.. ఇంగ్లండ్‌ 243/4
► ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ లార్డ్స్‌ టెస్టులో శతకంతో మెరిశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 82వ ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసిన రూట్‌ టెస్టు కెరీర్‌లో 22వ శతకాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.  

బెయిర్‌ స్టో ఔట్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బెయిర్‌ స్టో రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 57 పరుగులు చేసిన బెయిర్‌ స్టో  సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  దీంతో రూట్‌, బెయిర్‌ స్టోల మధ్య ఏర్పడిన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రూట్‌ 99, బట్లర్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లంచ్‌ విరామం.. ఇంగ్లండ్‌ 216/3
► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జో రూట్‌ 89 పరుగులతో సెంచరీకి చేరువ కాగా.. జానీ బెయిర్‌ స్టో 51 పరుగులతో ఆడుతున్నాడు.  టీమిండియా బౌలర్లలో సిరాజ్‌ రెండు.. షమీ ఒక వికెట్‌ తీశాడు. ఇంగ్లండ్‌ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులు వెనుకబడి ఉంది.

నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్‌.. 
► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. 65 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రూట్‌ 76, బెయిర్‌ స్టో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రూట్‌ హాఫ్‌ సెంచరీ.. ఇంగ్లండ్‌ 150/3
► టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆటలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 119/3 క్రితం రోజు స్కోరుతో ఇంగ్లండ్‌ ఆటను ఆరంభించింది.  49 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదిన రూట్‌ అర్థ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 214 పరుగులు వెనుకబడి ఉంది.

లార్డ్స్‌:  లార్డ్స్‌ టెస్టు రెండో రోజు ఆటను భారత్, ఇంగ్లండ్‌ బౌలర్లు పది వికెట్లతో శాసించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్‌ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్‌ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్‌ శుక్రవారం హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు