IND vs ENG 5th Test: 57 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌ 259/3

4 Jul, 2022 15:01 IST|Sakshi

కష్టాల్లో టీమిండియా
రూట్, బెయిర్‌స్టో భారీ భాగస్వామ్యం నెలకొల్పడం విజయంపై ఆశలు పెట్టుకున్న టీమిండియాకు షాక్‌ తగలిలేలా ఉంది. నాలుగోరోజు ఆటముగిసే సమయానికి 57 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 259/3 తో నిలిచింది. రూట్ 76 (112), బెయిర్‌స్టో 72 (87) పరుగులతో క్రీజులో ఉన్నారు.

42 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 181/3
42 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌(47),బెయిర్‌ స్టో(25) పరుగులతో ఉన్నారు.

38 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 157/3
38 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌(30),బెయిర్‌ స్టో(18) పరుగులతో ఉన్నారు.

26 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 114/3
ఇంగ్లండ్‌ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో పోప్‌ డకౌట్‌ కాగా, లీస్‌(56) రనౌట్‌ అయ్యాడు.  26 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో రూట్‌, బెయిర్‌ స్టో‍ ఉన్నారు.
తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
107 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 46 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.  
దూకుడుగా ఆడుతోన్న ఇంగ్లండ్‌.. 18 ఓవర్లకు 90 పరుగులు
378 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ దూకుడుగా ఆడుతోంది. 18 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. క్రీజులో  లీస్‌(53),క్రాలీ(36) పరుగులతో ఉన్నారు

9 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 53/0
9 ఓవర్లు మగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో లీస్‌(27),క్రాలీ(21) పరుగులతో ఉన్నారు

3 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 18/0
378 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ మూడు ఓవర్లు ముగిసే సరికి 18 పరుగులు చేసింది. క్రీజులో లీస్‌(17),క్రాలీ(1) పరుగులతో ఉన్నారు

245 పరుగులకు భారత్‌ ఆలౌట్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 378
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. భారత ఘిన​ఇన్నింగ్స్‌లో పుజారా(66), పంత్‌(57) తప్ప మిగితా బ్యాటర్లు విఫలమయ్యారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ నాలుగు వికెట్లు, పాట్స్‌, బ్రాడ్‌ చెరో రెండు వికెట్లు, అండర్సన్‌, లీచ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 132 పరుగులతో కలిపి టీమిండియా ఓవరాల్‌గా 377 పరుగల అధిక్యం సాధించింది. ఇంగ్లండ్‌ విజయ లక్ష్యం 378 పరుగులు.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
236 పరుగుల వద్ద భారత్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జడేజా.. స్టోక్స్‌ బౌలింగ్‌లొ క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
230 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. షమీ(13) స్టోక్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో జడేజా, బుమ్రా ఉన్నారు.


లంచ్‌ బ్రేక్‌.. టీమిండియా స్కోర్‌: 229/7
లంచ్‌ విరామానికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(17),షమీ(13) పరుగులతో ఉన్నారు


ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. 4 పరుగులు చేసిన శార్థూల్‌ ఠాకూర్‌.. పాట్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షమీ, జడేజా ఉన్నారు.

67 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 203/6
67 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(8),శార్థూల్‌ ఠాకూర్‌(1) ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. పంత్‌ ఔట్‌
198 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. 57 పరుగులు చేసిన పంత్‌.. జాక్‌ లీచ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శార్థూల్‌ ఠాకూర్‌ వచ్చాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. అయ్యర్‌ ఔట్‌
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన శ్రేయస్‌ అయ్యర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. 26 బంతుల్లో 19 పరుగులు చేసిన అయ్యర్‌, పాట్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 59.2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 186/4


58 ఓవర్లు భారత్‌ స్కోర్‌: 178/4
58 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో పంత్‌(46),శ్రేయస్‌ అయ్యర్‌(18) పరుగులతో ఉన్నారు.


నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
153 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 66 పరుగులు చేసిన ఛతేశ్వర్‌ పుజారా.. బ్రాడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు.

52 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 152/3
నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. 52 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్లు నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(66),పంత్‌(38) పరుగులతో ఉన్నారు.


47 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 131/3
47 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ట నష్టానికి 131 పరుగులు చేసిందిక్రీజులో పుజారా(53),పంత్‌(31) పరుగులతో ఉన్నారు,

సమయం 15:00 Pm: 125/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది. క్రీజులో పుజారా(50),పంత్‌(30) పరుగులతో ఉన్నారు,3

మరిన్ని వార్తలు