Ind Vs Eng 5th Test: తొలి రోజు ముగిసిన ఆట.. టీమిండియా 338/7

1 Jul, 2022 23:44 IST|Sakshi

India Vs England 5Th Test Rescheduled Match
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసేసమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రవీం‍ద్ర జడేజా 83 బ్యాటింగ్‌, మహ్మద్‌ షమీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రిషబ్‌ పంత్‌ (111 బంతుల్లో 146, 20 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డే తరహాలో ఆడాడు.

9: 22 PM: ఆరంభంలో వికెట్లు పడ్డా రిషభ్‌ పంత్‌, జడేజా టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు. ఈ క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 191/5. పంత్‌ 66, జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పంత్‌ హాఫ్‌ సెంచరీ
ఇంగ్లండ్‌తో టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్నాడు. మరో ఎండ్‌లో పంత్‌కు జడేజా సహకారం అందిస్తున్నాడు. టీ బ్రేక్‌ సమయానికి జడ్డూ 65 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

 8: 08 PM: జడేజా, పంత్‌ నిలకడగా ఆడుతున్నారు. 35 ఓవర్లు ముగిసే సరికి జడ్డూ 20 పరుగులు, రిషభ్‌ పంత్‌ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు: 130-5.

7: 23 PM:   శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. రవీంద్ర జడేజా, పంత్‌ క్రీజులో ఉన్నారు. భారత్‌ స్కోరు: 105-5.

వాన తెరిపి ఇవ్వడంతో లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆగిన ఆట మొదలైంది. ఈ క్రమంలో కాసేపటికే టీమిండియా మరో రెండు వికెట్లు కోల్పోయింది. కాగా 22.2 ఓవర్లో హనుమ విహారిని ఇంగ్లండ్‌ యువ బౌలర్‌ మాథ్యూ పాట్స్‌ బోల్తా కొట్టించాడు. దీంతో విహారి 20 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత కోహ్లిని సైతం అద్బుత రీతిలో బౌల్డ్‌ చేశాడు పాట్స్‌. దీంతో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. అంతకు ముందు ఓపెనర్లు గిల్‌, పుజారాలను ఆండర్సన్‌ అవుట్‌ చేశాడు. ఇక ప్రస్తుతం రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో ఉండగా.. భారత్‌ స్కోరు: 89/4 (26.4).

05: 25 PM: ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య రీ షెడ్యూల్డ్‌ టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా మొదటి రోజు లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆట ఆగింది.

లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ స్కోరు: 
4: 45 PM: ఇంగ్లండ్‌తో టెస్టు లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి ఒకటి, విహారి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు గిల్‌ 17, పుజారా 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించారు.

4:30 PM: టీమిండియా ఇన్నింగ్స్‌ నిలకడగా సాగుతుందనుకున్న సమయంలో భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్‌, నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా అవుటయ్యాడు. ఆండర్సన్‌ బౌలింగ్‌లో క్రాలేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. స్కోరు 52/2 (19).

కాగా మరో ఓపెనర్‌ గిల్‌ వికెట్‌ కూడా ఆండర్సన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. హనుమ విహారి, విరాట్‌ కోహ్లి క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతూ..
ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఓపెనర్‌ ఛతేశ్వర్‌ పుజారా, వన్‌డౌన్‌లో వచ్చిన ఛతేశ్వర్‌ పుజారా నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరు పరస్పర సమన్వయంతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. 

ఈ క్రమంలో 17 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 45/1. అంతకు ముందు గిల్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టులో 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: ఒక వికెట్‌ నష్టానికి 31 పరుగులు. హనుమ విహారి, ఛతేశ్వర్‌ పుజారా క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ డౌన్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్డ్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ ఆటగాడు ఆండర్సన్‌ బౌలింగ్‌(6.2 ఓవర్‌)లో క్రాలేకు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ పెవిలియన్‌ చేరాడు. అతడి స్థానంలో హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. పుజారాతో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 

ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 18-0. శుబ్‌మన్‌ గిల్‌(17), ఛతేశ్వర్‌ పుజారా(4) క్రీజులో ఉన్నారు.

టీమిండియా ఇంగ్లండ్‌ మధ్య రీషెడ్యూల్‌ టెస్టు శుక్రవారం మొదలైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఆహ్వానం మేరకు టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌, నయా వాల్‌ ఛతేశ్వర్‌ పుజారా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించాడు.

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌
టీమిండియాతో స్వదేశంలో జరుగుతున్న రీ షెడ్యూల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు జూలై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోవిడ్‌ కారణంగా దూరం కాగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్సీ చేపట్టాడు.

తుది జట్లు:
ఇంగ్లండ్‌: అలెక్స్‌ లీస్‌, జాక్‌ క్రాలే, ఓలీ పోప్‌, జొ రూట్‌, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), సామ్‌ బిల్లింగ్స్‌(వికెట్‌ కీపర్‌), మాథ్యూ పాట్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జాక్‌ లీచ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.

ఇండియా: శుబ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా(కెప్టెన్‌).

చదవండి: ENG vs IND: 'భారత్‌ అత్యుత్తమ బౌలింగ్‌ ఎటాక్‌తో బరిలోకి దిగాలి.. లేదంటే'

మరిన్ని వార్తలు