పాపం కోహ్లి.. భయపడి పారిపోయాడు

25 Feb, 2021 11:28 IST|Sakshi

కోహ్లిని కలిసేందుకు స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమాని

గాంధీనగర్‌: వీరాభిమాని ఒకరు టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లిని కలవడానికి బయో బబుల్‌ ప్రొటోకాల్‌ని ఉల్లంఘించాడు. స్టేడియంలోకి దూసుకెళ్లాడు. అతడిని గమనించిన కోహ్లి.. వెంటనే కొద్ది దూరం పరిగెత్తి.. సదరు అభిమానిని వెనక్కి తిరిగి వెళ్లాల్సిందిగా కోరాడు. ఈ సంఘటన బుధవారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ మొదటి రోజు చోటు చేసుకుంది. కోహ్లి అలా వెళ్లిపోవడం చూసిన ఆ వీరాభిమాని.. నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

కోవిడ్‌ నేపథ‍్యంలో ప్రస్తుతం ఆటగాళ్లందరూ బయో బబుల్‌ సెక్యూరిటీలో ఉన్నారు. బయో బబుల్‌ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ మేరకు ఆటగాళ్లను, మ్యాచ్ అధికారులను ఎవరినీ కలవడానికి అనుమతించరు. మ్యాచ్ ముందు శిక్షణ సెషన్ల సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక అభిమాని ప్రోటోకాల్‌లను ఉల్లంఘించడంపై జీసీఏ అధికారి మాట్లాడుతూ.. "మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము.. అభిమాని ఎవరో గుర్తించి. అతడిపై చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. 

అహ్మాదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం ప్రారంభమైన పింక్‌ బాల్‌ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 99/3 నిలవగా.. ఇంగ్లండ్‌ 112 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ (57), అజింక్య రహనె (1) క్రీజులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు