IND VS IRE 1st T20: ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం

27 Jun, 2022 07:04 IST|Sakshi

ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఐర్లాండ్‌తో జరగిన తొలి టీ20లో భారత్‌  7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఐర్లాండ్‌ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్‌(64) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో  భువీ, పాండ్యా, అవేశ్, చహల్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఇక 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 9.2 ఓవర్లలో మూడు  వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్‌ హుడా(47), ఇషాన్‌ కిషన్‌(26), హార్ధిక్‌ పాండ్యా(24) పరుగులతో రాణించారు.
మ్యాచ్‌ ప్రారంభానికి వరుణుడి ఆటంకం
టాస్‌ తర్వాత వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు ఇవాళ (జూన్‌ 26) ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడనుంది. డబ్లిన్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌​ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

టీమిండియా: హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), చహల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ 

ఐర్లాండ్‌: ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్‌), హ్యారీ టెక్టార్‌, గ్యారీ డెలానీ, పాల్‌ స్టిర్లింగ్‌, లోర్కాన్‌ టక్కర్‌, మార్క్‌ అడైర్‌, జాషువా లిటిల్‌, జార్జ్‌ డాక్రెల్‌, ఆండీ మెక్‌బ్రైన్‌, కానర్‌ ఆల్ఫర్ట్‌, క్రెయిగ్‌ యంగ్‌

మరిన్ని వార్తలు