IND Vs NZ 1st Test: జడేజా, అయ్యర్‌ అర్థశతకాలు.. ముగిసిన తొలిరోజు ఆట

25 Nov, 2021 17:21 IST|Sakshi

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదటి రోజు ఆటను ముగించింది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.  శ్రేయాస్‌ అయ్యర్‌ 75*, రవీం‍ద్ర జడేజా 50* పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరిమధ్య ఇప్పటివరకు ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు శుబ్‌మన్‌ గిల్‌ 52 పరుగులు చేసి ఔట్‌ కాగా.. మిగతా టీమిండియా బ్యాటర్స్‌లో రహానే 35, పుజారా 26, మయాంక్‌ 13 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జేమీసన్‌ 3 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా తొలి రోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.  కాగా వెళుతురు లేమితో అంపైర్లు ఆరు ఓవర్లు ముందే ఆటను నిలిపివేశారు.   

► తొలి టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 80 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 69, రవీంద్ర జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అరంగేట్ర టెస్టులోనే శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం మూడో సెషన్‌లో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్న టీమిండియా 72 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అయ్యర్‌ 54, రవీంద్ర జడేజా 29 పరుగులతో ఆడుతున్నారు.

106 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగుల చేసిన పుజారా, సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి భారత్‌ 119 పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో రహానే (17), శ్రేయాస్‌ అయ్యర్‌(6)పరుగులతో ఉన్నారు.

82 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 52 పరుగులు చేసిన గిల్‌, కైల్ జామీసన్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఛతేశ్వర్‌ పుజారా(8), రహానే (0)పరుగులతో ఉన్నారు.

 న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(40), ఛతేశ్వర్‌ పుజారా(8) పరుగులతో ఉన్నారు.

 టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. జెమీషన్‌ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌ అగర్వాల్‌ అవుట్‌ అయ్యాడు. ఈ క్రమంలో నయా వాల్‌ ఛతేశ్వర్‌ పుజారా క్రీజులోకి వచ్చాడు. 

పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 24-1. 

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య  కాన్పూర్‌ వేదికగా గురువారం జరుగుతున్న తొలి టెస్ట్‌లో టాస్‌ గెలిచి టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడించిన న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు కివీస్‌ కూడా టి20 సిరీస్‌లో ఎదురైన క్లీన్‌స్వీప్‌ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

అయితే ఈ సారి సీనియర్ల గైర్హాజరీలో భారత యువ జట్టు బరిలోకి దిగుతున్నది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా భారత్‌ గడ్డపై కివీస్ చివరి సారిగా 1988లో టెస్టు మ్యాచ్ గెలిచింది. 

భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్‌) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్

న్యూజిలాండ్‌ జట్టు:  టామ్‌ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే

చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్‌... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక..

మరిన్ని వార్తలు