IND Vs NZ: టాస్‌ గెలిచిన టీమిండియా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు మొండిచేయి

21 Jan, 2023 13:20 IST|Sakshi

రాయ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఏంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రకటించాడు. రెండో వన్డేలో కచ్చితంగా ఆడతాడనుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అటు న్యూజిలాండ్‌ జట్టు కూడా ఏం మార్పులేకుండానే బరిలోకి దిగుతుంది. 

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్, హార్దిక్, సుందర్, కుల్దీప్‌ యాదవ్, షమీ, సిరాజ్, శార్దూల్‌ ఠాకూర్‌

న్యూజిలాండ్‌: టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్, డెవన్‌ కాన్వే,హెన్రీ నికోల్స్‌, డారిల్‌ మిచెల్, గ్లెన్‌ ఫిలిప్స్, మైకేల్‌ బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, బ్లెయిర్‌ టిక్నర్‌, హెన్రీ షిప్లే

ఇక ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్‌పై కన్నేసింది. మరోవైపు తొలి వన్డేలో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న కివీస్‌ రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్‌ సమం చేయాల​ని భావిస్తోంది. బ్యాటింగ్‌లో పెద్దగా లోపాలు లేకపోయినప్పటికి బౌలింగ్‌ అంశం టీమిండియాను కలవరపెడుతుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది.

కోహ్లి, సూర్యకుమార్‌, గిల్‌లు రాణిస్తే టీమిండియాకు డోకా లేదని చెప్పొచ్చు. ఇక తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో మెరిసిన శుబ్‌మన్‌ గిల్‌పై మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బౌలింగ్‌లో సిరాజ్‌ సూపర్‌ ప్రదర్శన కనబరుస్తున్నాడు. షమీ ఆరంభ ఓవర్లలో చక్కగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికి డెత్‌ ఓవర్లలో తేలిపోతున్నాడు. స్పిన్నర్లుగా సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తన ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది.

అటు న్యూజిలాండ్‌ మాత్రం సీనియర్ల గైర్హాజరీలోనూ మంచి ప్రదర్శన ఇస్తుంది. అయితే తొలి వన్డేలో మైకెల్‌ బ్రాస్‌వెల్‌ విధ్వంసం కివీస్‌లో జోష్‌ నింపింది. ఆల్‌రౌండర్లు ఉండడం జట్టుకు సానుకూలాంశం. బ్యాటింగ్‌ ఇబ్బంది లేకున్నా.. బౌలింగ్‌ కాస్త గాడిన పడాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు