Ind Vs Nz Test Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఇదే.. సారథిగా రహానే.. వైస్‌ కెప్టెన్‌గా..

12 Nov, 2021 12:50 IST|Sakshi

BCCI announces India’s 16-man squad for New Zealand Tests: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. విరాట్‌ కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఇక అతడికి డిప్యూటీగా నయా వాల్‌ ఛతేశ్వర్‌ పుజారా పేరును ప్రకటించింది.

ఇక టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కి విశ్రాంతినిచ్చింది. కాగా ఈ సిరీస్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా  మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు 7 వరకు టీమిండియా కివీస్‌తో రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో టెస్టు నుంచి అందుబాటులోకి రానున్నాడు.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు:

అజింక్య రహానే(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్ పుజారా(వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ఆర్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, విరాట్‌ కోహ్లి(రెండో టెస్టు నుంచి అందుబాటులోకి).

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌:

►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్‌.
►రెండో టీ20- నవంబరు 19, రాంచి.
►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా.
►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌.
►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై.

చదవండి: T20 World Cup 2021 Final: ఇంటర్వెల్‌ వరకు ఫేవరెట్లు.. ఆఖర్లో ప్రేక్షకులు మరి..అంతేగా అంతేగా!!

Poll
Loading...
మరిన్ని వార్తలు