ODI WC 2023 Revised Schedule: అక్టోబర్‌ 14న భారత్‌ vs పాకిస్తాన్‌

10 Aug, 2023 04:15 IST|Sakshi

ఒకరోజు ముందుకు జరిగిన కీలక సమరం

మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు

ముంబై: వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేశారు. అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాలు... కోల్‌కతాలో కాళీ మాత పూజల కారణంగా తప్పనిసరిగా రెండు మ్యాచ్‌ల తేదీలలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీని వల్ల ఇతర మార్పులు కూడా అవసరం కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మరో ఏడు మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చింది.

దీని ప్రకారం టోర్నమెంట్‌కే హైలైట్‌ మ్యాచ్‌ అయిన భారత్, పాకిస్తాన్‌ మధ్య అక్టోబర్‌ 15న జరగాల్సిన పోరును ఒకరోజు ముందుగా అక్టోబర్‌ 14న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో కూడా అక్టోబర్‌ 12న జరగాల్సిన పాకిస్తాన్‌–శ్రీలంక మ్యాచ్‌ అక్టోబర్‌ 10కి మారింది. అక్టోబర్‌ 10న ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌  జట్ల మధ్య డే అండ్‌ నైట్‌గా జరగాల్సిన మ్యాచ్‌ను డేగా నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు