Ind Vs SL 1st T20: బోణీ కొట్టిన టీమిండియా

25 Jul, 2021 23:46 IST|Sakshi

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును 126 పరుగులకే ఆలౌట్‌ చేసి సిరీస్‌లో తొలి విజయం నమోదు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కుమార్‌ 4, దీపక్‌ చహర్‌ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. ఫెర్నాండో(26) ఔట్‌
రెండు పరుగుల వ్యవధిలో లంక జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 7వ ఓవర్‌ తొలి బంతికి చహల్‌... ధనంజయ డిసిల్వా(10 బంతుల్లో 9; ఫోర్‌)ను పెవిలియన్‌కు పంపగా, 8వ ఓవర్‌ తొలి బంతికి భువీ.. అవిష్క ఫెర్నాండో(23 బంతుల్లో 26; 3 ఫోర్లు)ను ఔట్‌ చేశాడు. 7.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 50/2గా ఉంది. క్రీజ్‌లో అసలంక(1), బండార(0) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. భానుక(10) ఔట్‌
165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే 3వ ఓవర్లో ఆ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. టీమిండియా స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో భానుక(7 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 25/1. క్రీజ్‌లో అవిష్క ఫెర్నాండో(12), ధనంజయ డిసిల్వా(1) ఉన్నారు. 

శ్రీలంక టార్గెట్‌ 165
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్‌(50), ధవన్‌(46) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పృథ్వీ షా(0), హార్ధిక్‌ పాండ్యా(0) మరోసారి నిరశపరచగా సామ్సన్‌ పర్వాలేదనిపించాడు. ఇషాన్‌ కిషన్‌(20), కృనాల్‌(3) నాటౌట్‌ బ్యాట్స్‌మెన్లుగా నిలిచారు. లంక బౌలర్లలో చమీరా, హసరంగ చెరో రెండు వికెట్లు, కరుణరత్నే ఓ వికెట్‌ పడగొట్టారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. హార్ధిక్‌ పాండా(10) ఔట్‌
చమీరా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ భానుకకు క్యాచ్‌ ఇచ్చి హార్ధిక్‌(12 బంతుల్లో 10;  ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 155/5గా ఉంది. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌(14), కృనాల్‌ పాండ్యా(1) ఉన్నారు. 

ఫిఫ్టి కొట్టి వెంటనే ఔటైన సూర్యకుమార్‌
సిక్స్‌ కొట్టి టీ20ల్లో రెండో ఫిఫ్టి నమోదు చేసిన సూర్యకుమార్‌(34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో లాంగ్‌ ఆఫ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 15.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 127/4గా ఉంది. క్రీజ్‌లో హార్దిక్‌ పాండ్యా(0), ఇషాన్‌ కిషన్‌(0) ఉన్నారు.

టీమిండియా మూడో వికెట్ డౌన్‌.. గబ్బర్‌(46) ఔట్‌
జట్టు స్కోర్‌ 113 పరుగుల వద్ద కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌(36 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్స్‌) పెవిలియన్‌కు చేరాడు. టీ20ల్లో 12వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని గబ్బర్‌ చేజార్చుకున్నాడు. 14.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 113/3గా ఉంది. క్రీజ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(28 బంతుల్లో 37; 5 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా(0) ఉన్నారు.

10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 78/2
సామ్సన్‌ పెవిలియన్‌ బాట పట్టాక టీమిండియా ప్లేయర్లు ధవన్‌(23 బంతుల్లో 27; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌(16 బంతుల్లో 22; 3 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు. దీంతో 10 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 78/2గా ఉంది.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. సామ్సన్‌(27) ఔట్‌
అంతకుముందు ధనంజయ వేసిన ఆరో ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ సహా మొత్తం 16 పరుగులు పిండుకున్న సామ్సన్‌(20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్‌).. 7 ఓవర్‌ తొలి బంతికే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో సామ్సన్‌.. వికెట్ల ముందు చిక్కాడు. 7.1 ఓవర్ల తర్వాత టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధవన్‌(16 బంతుల్లో 22; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌(0) ఉన్నారు. 

ఆచితూచి ఆడుతున్న టీమిండియా.. 5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 35/1
తొలి బంతికే పృథ్వీ షా డకౌటయ్యాక ధవన్‌(16 బంతుల్లో 22; 3 ఫోర్లు), సామ్సన్‌(20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్‌)లు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 35/1గా ఉంది.  

తొలి బంతికే వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. పృథ్వీ షా డకౌట్‌
టీ20 క్రికెట్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా వెనుదిరిగాడు. చమీరా బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ భానుకకు క్యాచ్‌ ఇచ్చి షా పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి సంజూ సామ్సన్‌ వచ్చాడు. 

కొలొంబో: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అతిధ్య లంక జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగగా.. యువ ఓపెనర్‌ పృథ్వీ షా, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20 అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు లంక జట్టు ఆఖరి వన్డే ఆడిన జట్టులో మూడు మార్పులు చేసి బరిలోకి దిగనుంది.  కాగా, లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీ20 స్పెషలిస్ట్ ఇసురు ఉడానా తుది జట్టులో చేరాడు. 
తుది జట్లు: 
భారత్: పృథ్వీ షా, శిఖర్ ధవన్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్‌(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, చహల్

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), ధనుంజయ డిసిల్వా, చరిత్‌ అసలంక, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, అశేన్‌ బండార, వానిందు హసరంగ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనంజయ
 

>
మరిన్ని వార్తలు