IND VS WI 1st T20: తొలి టీ20లో భారత్‌ విజయం

29 Jul, 2022 19:45 IST|Sakshi

తొలి టీ20లో భారత్‌ విజయం
బ్రియన్‌ లారా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌ విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆతిథ్య జట్టు మొదటి టీ20లో 68 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

5 వికెట్లు కోల్పోయిన విండీస్‌
11.1 ఓవర్లలో వెస్టిండీస్‌ జట్టు 82 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. హెట్‌మెయిర్‌ 13 పరుగులు, అకేల్ హోసేన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 17 బంతుల్లో 14 పరుగులు చేసిన పావెల్‌ రవి బిష్ణోయ్‌ ఓవర్లో 5వ వికెట్‌గా వెనుదిరిగాడు.

42 పరుగులకు 3 వికెట్లు
191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ జట్టు 6 ఓవర్లలో 42 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. రోవ్‌మన్‌ పావెల్‌, నికోలస్‌ పూరన్‌ క్రీజులో ఉన్నారు.

చెలరేగిన రోహిత్‌, కార్తీక్‌.. విండీస్‌ టార్గెట్‌ 191 పరుగులు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(64), దినేష్‌ కార్తీక్‌(41) పరుగులతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో జోసఫ్‌ రెండు వికెట్లు,మెక్‌కాయ్‌,హోల్డర్,కీమో పాల్, హోసన్‌ తలా వికెట్‌ సాధించారు.

దుమ్మురేపిన రోహిత్‌.. 15 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 131/5
భారత కెప్టెన్‌ రోహిత్‌ దుమ్ము రేపాడు. 44 బంతుల్లో 64 పరుగులు చేసిన రోహిత్‌.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.


నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
హార్ధిక్‌ పాండ్యా రూపంలో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పాండ్యా.. జోసఫ్‌ బౌలింగ్‌లో మెక్‌కాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 124/4, క్రీజులో రోహిత్‌ శర్మ(63), జడేజా(9) పరుగులతో ఉన్నారు.


మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..పంత్‌ ఔట్‌
88 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన పంత్‌ కీమో పాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.


10 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 73/2
10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(33),పంత్‌(6) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌..
45 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మోక్‌కాయ్‌ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్  అకేల్ హోసేన్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో రోహిత్‌ శర్మ, పంత్‌ ఉన్నారు.7 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 50/2

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ అకేల్ హోసేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రోహిత్‌ శర్మ(15), శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.

2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 20/0
2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(9), సూర్యకుమార్‌ యాదవ్‌(10) పరుగులతో ఉన్నారు.

బ్రియన్‌ లారా స్టేడియం వేదికగా తొలి టీ20లో వెస్టిండీస్‌తో భారత్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా వన్డే సిరీస్‌కు  గాయం కారణంగా దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్

వెస్టిండీస్‌: షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్(కెప్టెన్‌), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్

మరిన్ని వార్తలు