IND Vs WI 2nd ODI: భారత్‌, వెస్టిండీస్‌ రెండో వన్డే అప్‌డేట్స్‌

25 Jul, 2022 04:08 IST|Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: అవే జట్లు.. అదే ఉత్కంఠ.. వెస్టిండీస్‌‌-టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ విజయం కోసం ఆఖరి ఓవర్‌ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కాకపోతే మొదటి మ్యాచ్‌లో విండీస్‌ జట్టు పోరాడితే.. నేడు టీమిండియా పోరాడింది. అయితే ఫలితం మాత్రం మారలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టీమిండియా 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది.

3 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్‌ పటేల్‌ సిక్సర్‌ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను దక్కించుకుంది. భారత బ్యాట్‌మన్లలో అక్షర్‌ పటేల్‌ 35 బంతుల్లో 64 నాటౌట్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌ 63, సంజూ శామ్సన్‌ 54, శుభమన్‌ గిల్‌ 43, దీపక్‌ హుడా 33 పరుగులతో రాణించారు.

టీమిండియా టార్గెట్‌ 312
►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చి అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న షెయ్‌ హోప్‌ 115 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా .. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ 74 పరుగులు, కేల్‌ మేయర్స్‌ 39 పరుగులు, బ్రూక్స్‌ 35 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, యజ్వేంద్ర చహల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన హోప్‌.. 
►వెస్టిండీస్‌ ఓపెనర్‌ షెయ్‌ హోప్‌ రెండో వన్డేలో అద్భుత సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వచ్చిన హోప్‌ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం విండీస్‌ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 

నిలకడగా సాగుతున్న వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌.. 
►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. 36 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షెయ్‌ హోప్‌ 82, పూరన్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌గా వచ్చిన హోప్‌ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 65 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది

27 ఓవర్లలో వెస్టిండీస్‌ 148/3
►27 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. హోప్‌ 64, పూరన్‌ 8 క్రీజులో ఉన్నారు.

హోప్‌ హాఫ్‌ సెంచరీ.. వెస్టిండీస్‌ 141/3
►వెస్టిండీస్‌ ఓపెనర్‌ షెయ్‌ హోప్‌ అర్థ సెంచరీతో మెరిశాడు. మరోపక్క చహల్‌ బౌలింగ్‌లో బ్రాండన్‌ కింగ్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో విండీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హోప్‌ 62, పూరన్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌
►నిలకడగా సాగుతున్న విండీస్‌ ఇన్నింగ్స్‌కు అక్షర్‌ పటేల్‌ తెరదించాడు. 35 పరుగులు చేసిన షమ్రా బ్రూక్స్‌ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌ 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

19 ఓవర్లలో వెస్టిండీస్‌ స్కోరెంతంటే?
►19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ వికెట్‌ నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్‌ షెయ్‌ హోప్‌ 41 పరుగులతో నిలకడగా ఆడుతుండగా.. అతనికి బ్రూక్స్‌(28 పరుగులు) నుంచి చక్కని సహకారం అందుతుంది. 

కైల్‌ మేయర్స్‌(39) ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌
►రెండో వన్డేలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన విండీస్‌కు దీపక్‌ హుడా షాక్‌ ఇచ్చాడు. 39 పరుగులు చేసిన కైల్‌ మేయర్స్‌ హుడా బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి విండీస్‌ వికెట్‌ నష్టానికి 78 పరుగులు చేసింది. హోప్‌ 26, బ్రూక్స్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ధాటిగా ఆడుతున్న వెస్టిండీస్‌
►టీమిండియాతో రెండో వన్డేలో వెస్టిండీస్‌ ధాటిగా ఆడుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 39, షెయ్‌ హోప్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు.

4 ఓవర్లలో వెస్టిండీస్‌ 24/0
►4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 14, షెయ్‌ హోప్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌
►టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే ఆసక్తికరంగా మొదలైంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక​ ఈ మ్యాచ్‌లో గెలిచి.. మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. విండీస్‌ మాత్రం గెలిచి నిలబడాలని ప్రయత్నిస్తోంది. ఇక టీమిండియా తరపున ఆవేశ్‌ ఖాన్‌ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.

ఐదుగురు స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్‌ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్‌ పర్యటనలో వరుసగా రెండో సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్‌ అప్పగించిన వెస్టిండీస్‌ మరో సిరీస్‌ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

వెస్టిండీస్: షెయ్ హోప్(వికెట్‌ కీపర్‌), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్
భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్‌), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ 

మరిన్ని వార్తలు