భారత్‌ ఖాతాలో కాంస్యం

14 Oct, 2022 01:42 IST|Sakshi

ప్రపంచ చాంపియన్‌షిప్‌ షూటింగ్‌

కైరో: అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి రోజే కాంస్యంతో బోణీ కొట్టింది. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, నామ్య కపూర్, విభూతి భాటియాలతో కూడిన జట్టు మహిళల 25 మీటర్ల జూనియర్‌ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచింది.

కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత బృందం 17–1తో జర్మనీపై గెలిచింది. ముందుగా క్వాలిఫికేషన్‌లో 856 పాయింట్లతో భారత బృందం నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్‌లో 437 పాయింట్ల స్కోరు చేసిన భారత త్రయం జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు కాంస్యం కోసం తలపడగా భారత్‌ విజయం సాధించింది. 

>
మరిన్ని వార్తలు