నేడు భారత్, ఇంగ్లండ్‌ మహిళల తొలి టి20

9 Jul, 2021 05:40 IST|Sakshi

నార్తాంప్టన్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇక టి20ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు భారత్,ఇంగ్లండ్‌ల మధ్య తొలిటి20 జరుగనుంది.  వన్డేల్లాగే ఈ ఫార్మాట్‌లోనూ ప్రత్యర్థి జట్టు మనకంటే బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫామ్‌లో లేని కెప్టెన్‌ హర్మన్‌పైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభంపై భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్నేహ్‌ రాణా, రిచా ఘోష్‌లతో పాటు సీనియర్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మరో వైపు స్టార్‌ ప్లేయర్‌ డానీ వ్యాట్‌ పునరాగమనంతో ఇంగ్లండ్‌ మరింత పటిష్టంగా తయారైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు