కాంస్య పతకంతో భారత్‌ బోణీ

18 Aug, 2023 02:22 IST|Sakshi

ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్‌ పతకాల బోణీ కొట్టింది. అజర్‌బైజాన్‌ రాజధాని బకూలో గురువారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శివా నర్వాల్‌ (579), సరబ్‌జోత్‌ సింగ్‌ (578), అర్జున్‌ సింగ్‌ (577)లతో కూడిన భారత జట్టు 1,734 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

వ్యక్తిగత క్వాలిఫయింగ్‌ పోటీల్లో ఆయా దేశాల షూటర్లు సాధించిన పాయింట్ల సగటు ఆధారంగా టీమ్‌ ఈవెంట్‌ పతకాలను ఖరారు చేస్తారు. భారత పిస్టల్‌ షూటర్లెవరూ టాప్‌–8లో నిలవకపోవడంతో వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. మరోవైపు హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్, పలక్, దివ్యలతో కూడిన భారత మహిళల పిస్టల్‌ జట్టు 1,708 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు