టీమిండియా క్లీన్‌స్వీప్ చేయనుందా ?

8 Dec, 2020 13:17 IST|Sakshi

సిడ్నీ : ఆసీస్‌తో జరగుతున్న మూడో టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఏంచుకుంది. కాగా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గత మ్యాచ్‌ వేదికలోనే ఇరు జట్లు మూడో టీ20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్‌ తరహాలోనే చివరి మ్యాచ్‌ గెలిచి ఆసీస్‌ లెక్క సరి చేస్తుందా... లేక భారత్‌ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్‌ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఇక ఆసీస్‌ విషయానికి వస్తే గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫించ్‌ మళ్లీ తుది జట్టులోకి వచ్చేశాడు.

తుది జట్లు :
భారత్ ‌: కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా, శార్దుల్, సుందర్, దీపక్‌ చహర్, నటరాజన్, చహల్‌

ఆస్ట్రేలియా : ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్, డీ ఆర్సీ షార్ట్‌, హెన్రిక్స్, సీన్‌ అబాట్, స్యామ్స్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు