ఇదేం విధ్వంసం.. 125 బంతుల్లో 331 పరుగులు; 30 సిక్సర్లు, 28 ఫోర్లు

26 Nov, 2021 20:28 IST|Sakshi
మోహక్‌ కుమార్‌

Mohak Kumar Smashed 331 Runs In 125 Balls Smashed 30 Sixes Under 14 Cricket: 125 బంతుల్లో 331 పరుగులు.. 30 సిక్సర్లు.. 28 ఫోర్లు. ఇది ఒక జట్టు ఇన్నింగ్స్‌ అనుకుంటే పొరపాటే. ఎందుకుంటే ఈ పరుగులన్ని చేసింది ఒక్కడే. కొడితే బౌండరీ.. లేదంటే సిక్స్‌ అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశాడు అండర్‌-14 కుర్రాడు.. మోహక్‌ కుమార్‌.

అండర్-14 డ్రీమ్ ఛేజర్ కప్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మోహక్‌.. బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన మోహక్.. కేవలం సిక్సర్లతోనే 180 పరుగులు చేయగా.. మరో 112 పరుగులను ఫోర్లతో రాబట్టాడు. ఓవరాల్‌గా 331 పరుగులు చేసిన మోహక్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.ఈ విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్‌లో వెల్లడించింది. 

చదవండి: Ravindra Jadeja: క్లీన్‌బౌల్డ్‌‌ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు


ప్రణవ్ ధనవాడే

కాగా 2016 సంవత్సరంలో మహారాష్ట్ర క్రికెటర్ ప్రణవ్ ధనవాడే స్కూల్ క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక మ్యాచ్‌లో 1,009 పరుగులు చేసి.. ప్రపంచంలో ఒక మ్యాచ్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఇజె కాలిన్స్ 1899లో 628 పరుగులు చేశాడు.

చదవండి: ECS T10 League: బౌండరీ కొట్టాలని చూశాడు.. దురదృష్టం వెంటాడింది

మరిన్ని వార్తలు