Asia Cup 2022: ఆసియా కప్ లో తిరుగులేని రోహిత్ శర్మ.. సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేస్తాడా?

15 Aug, 2022 17:12 IST|Sakshi

యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియకప్‌కు టీమిండియా సిద్దమవుతోంది. భారత తమ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా తలపడనుంది. కాగా ఆసియా కప్‌కు  ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఆసియా కప్‌లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డుపై రోహిత్‌ కన్నేశాడు.

ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో 971 పరుగులతో సచిన తొలి స్థానంలో ఉన్నాడు. ఇక 883 పరుగులతో రెండో స్థానంలో రోహిత్‌.. మరో 89 పరుగులు సాధిస్తే సచిన్‌ అధిగిమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. అదే విధంగా రోహిత్‌ మరో 117 పరుగులు చేయగల్గితే ఆసియాకప్‌లో 1000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్‌ నిలుస్తాడు. ఇక ఓవరాల్‌గా ఆసియాకప్‌లో 1000 పరుగుల సాధించిన లిస్ట్‌లో రోహిత్‌ మూడో స్థానంలో నిలువనున్నాడు.

ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 1220 పరుగులతో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య టాప్‌లో ఉండగా.. 1075 పరుగులతో మరో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార్ సంగక్కర కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన సనత్‌ జైసూర్య రికార్డును  రోహిత్‌ బ్రేక్‌ చేయాలంటే 338 పరుగులు సాధించాలి.

కాగా ఈ మెగా టోర్నీలో భారత్‌ ఆరు మ్యాచ్‌లు ఆడనుంది కాబట్టి  జయసూర్య రికార్డు రోహిత్‌ బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఆసియా కప్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ 883 పరుగు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 హాఫ్‌ సెంచరీలు, సెంచరీ ఉన్నాయి.
చదవండి: Martin Guptill- Rohit Sharma: రోహిత్‌ రికార్డు బద్దలు కొట్టిన గప్టిల్‌.. మరోసారి అగ్రస్థానంలోకి!

మరిన్ని వార్తలు