ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత మాజీ చెస్‌ చాంపియన్‌

26 Feb, 2022 14:05 IST|Sakshi

భారత చెస్‌ ఆటగాడు అన్వేష్‌ ఉపాధ్యాయ ఉక్రెయిన్‌లో​ చిక్కుకుపోయాడు. 2017లో జాతీయ  ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన అన్వేష్‌ ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 2012 నుంచి ఉక్రెయిన్‌లో ఉంటున్న అన్వేష్‌ ఈ మార్చిలో భారత్‌కు తిరిగి రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. అయితే ఇంతలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఏం బాగాలేదని.. ఎప్పుడు ఏమవుతుందోనని క్షణంక్షణం.. భయంభయంగా గడుపుతున్నట్లు అన్వేష్‌ పేర్కొన్నాడు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో అన్వేష్‌ కూడా ఒకడిగా ఉన్నాడు. రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌ తమ ఎయిర్‌బేస్‌ను మూసేయడంతో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలు స్తంభించాయి. కాగా తనను సురక్షితంగా భారత్‌కు పంపించాలని ఇప్పటికే అన్వేష్‌ ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కార్యాలయానికి వెళ్లి అధికారులను విజ్ఞప్తి చేశాడు. కాగా ఉక్రెయిన్‌లో​ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. 

చదవండి: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్‌ స్టార్‌

Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..


 

మరిన్ని వార్తలు