IND Vs PAK Super-4: 'టీమిండియా 36 ఆలౌట్‌'.. భయ్యా మీకు అంత సీన్‌ లేదు!

4 Sep, 2022 13:48 IST|Sakshi

చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే అభిమానుల కామెంట్లు తారాస్థాయిలో ఉంటాయి. మా జట్టు ఫెవరెట్‌ అని గొప్పలు చెప్పుకున్నప్పటికి.. ఆరోజు మ్యాచ్‌లో ఎవరు మంచి ప్రదర్శన చేస్తే వారికే విజయం దక్కుతుంది. తాజాగా మరికొద్ది గంటల్లో ఆసియాకప్‌ 2022లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌లు సూపర్‌-4లో మరోసారి తలపడనున్నాయి. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్న సంగతి పక్కనబెడితే.. ఈ ఆదివారం హోరాహోరి పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించి ఆధితప్యం చెలాయించాలని చూస్తుంటే.. పాక్‌ మాత్రం ప్రతీకారంతో రగిలిపోతుంది. 

ఈ నేపథ్యంలోనే ఒక పాక్‌ అభిమాని తన ట్విటర్‌లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలుతుంది.. పాక్‌కు భారీ విజయం ఖాయం అంటూ పోస్ట్‌ చేశాడు. '' హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38 పరుగులకే ఆలౌటైంది. అదే ప్రదర్శనను పాక్‌ బౌలర్లు భారత్‌పై చేస్తారని ఊహించుకోండి.. ఫలితం మీకే కనిపిస్తుంది.. టీమిండియా 36 పరుగులకే ఆలౌట్‌ అయి దారుణ పరాజయం మూటగట్టుకుంటుంది'' అంటూ పేర్కొన్నాడు.

పాక్‌ అభిమాని పోస్ట్‌ చూసిన భారత్‌ ఫ్యాన్స్‌ ఊరుకుంటారా. వెంటనే సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఒకసారి జరిగిందని ప్రతీసారి జరగాల్సిన అవసరం లేదు..'' కలల కనొచ్చు తప్పులేదు.. కానీ మీకు అంత సీన్‌ లేదు..''.. అదే 36 పరుగుల విషయంలో సీన్‌ రివర్స్‌ అయితే.. ఎలా ఉంటుంది'' అంటూ విమర్శలు వర్షం కురిపించారు. ఇక మరొక భారత​ అభిమాని మాత్రం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

''అవును టీమిండియా 36 పరుగులకు ఆలౌట్‌ కావొచ్చు.. కానీ చేధనలో మీ జట్టు(పాకిస్తాన్‌) 33 పరుగులకే కుప్పకూలనుంది. మా స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ స్పెల్‌(3-1-6-9) నమోదు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకోనున్నాడని ఊహించుకున్నాం.. ఇప్పుడేం చేస్తావు'' అంటూ ధీటుగా బదులిచ్చాడు.

చదవండి: 'ఆసియా కప్‌లా లేదు.. బెస్ట్‌ ఆఫ్‌ త్రీ ఆడుతున్నట్లుంది'

Mushfiqur Rahim: టీ20లకు గుడ్‌బై చెప్పిన స్టార్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు