SAAF: ‘శాఫ్‌’ ఫుట్‌బాల్‌ చాంప్‌ భారత్‌ 

16 Sep, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–17 సాకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిలు టైటిల్‌ నిలబెట్టుకున్నారు. కొలంబోలో గురువారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 4–0తో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. బాబి సింగ్‌ (18వ ని.), కొరవ్‌ సింగ్‌ (30వ ని.), కెప్టెన్‌ వాన్లల్‌పెక గీటే (63వ ని.), అమన్‌ (90+4వ ని.) తలా ఒక గోల్‌ చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. లీగ్‌ దశలో నేపాల్‌ చేతిలో 1–3తో ఎదురైన పరాజయానికి ఫైనల్లో అసాధారణ ప్రదర్శనతో ప్రతీకారం తీర్చుకున్నారు. 

మరిన్ని వార్తలు