IND vs WI: టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్లు.. ఇదే తొలి సారి!

8 Aug, 2022 22:03 IST|Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్పిన్నర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు ఏకంగా 10కి 10 వికెట్లు పడగొట్టారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ప్రత్యర్థి జట్టు మొత్తం 10 వికెట్లు స్పిన్నర్లు తీయడం ఇదే తొలి సారి.

ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. రవి బిష్ణోయ్‌ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..ఫ్లోరిడా వేదికగా ఐదో టీ20లో విండీస్‌పై భారత్‌ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 188 పరుగులు చేసింది.

టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(40 బంతుల్లో 64 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీపక్‌ హుడా  38 పరుగులు చేసి రాణించాడు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ భారత స్పిన్నర్ల ధాటికి 100 పరుగులకే కుప్ప కూలింది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 4-1తో కైవసం చేసుకుంది.
చదవండిAsia Cup 2022: ఆసియాకప్‌కు జట్టును భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు

మరిన్ని వార్తలు