India Sqaud For Aus ODI Series: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌.. అశ్విన్‌ రీఎంట్రీ

18 Sep, 2023 21:10 IST|Sakshi

ఈ నెల (సెప్టెంబర్‌) 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో  జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు ఇవాళ (సెప్టెంబర్‌ 18) రెండు వేర్వేరు జట్లను ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లకు సెలెక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్‌లలో టీమిండియాకు కేఎల్‌ రాహుల్‌ నాయకత్వం వహించనున్నాడు.

రాహుల్‌కు డిప్యూటీగా తొలి రెండు మ్యాచ్‌లకు రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు. రోహిత్‌, కోహ్లి, హార్దిక్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తిరిగి మూడో వన్డేకు జట్టులో చేరతారు. అందరూ ఊహించిన విధంగానే సెలెక్టర్లు వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు పిలుపునిచ్చారు. ఊహించని విధంగా తొలి రెండు వన్డేలకు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎంపికయ్యాడు. గైక్వాడ్‌ ఆసియా క్రీడల్లో టీమిండియాకు నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే.

ఆసియా కప్‌ సందర్భంగా గాయపడిన అక్షర్‌ పటేల్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు జట్లలో చోటు దక్కించుకోగా.. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ తొలి రెండు వన్డేలకు ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

కాగా, ఈ సిరీస్‌లో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ అయిపోయిన వెంటనే వరల్డ్‌కప్‌ సన్నాహక మ్యాచ్‌లు మొదలవుతాయి. అక్టోబర్‌ 5 నుంచి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు స్టార్ట్‌ అవుతాయి.

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో 2023 వరల్డ్‌కప్‌ మొదలవుతుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. మెగా టోర్నీలో భారత్‌.. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఆతర్వాత అక్టోబర్‌ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్‌ 14న పాకిస్తాన్‌లను ఢీకొంటుంది. చిరకాల  ప్రత్యర్ధితో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. 

ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఆసీస్‌తో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

మరిన్ని వార్తలు