యూఏఈ చేరుకున్న మహిళా క్రికెటర్లు

23 Oct, 2020 06:11 IST|Sakshi

దుబాయ్‌: మహిళల టి20 చాలెంజ్‌ సిరీస్‌ కోసం భారత టాప్‌–30 మహిళా క్రికెటర్లు గురువారం యూఏఈ చేరుకున్నారు.  షార్జా వేదికగా నవంబర్‌ 4 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో భారత వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్, టి20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ తదితరులు పాల్గొననున్నారు. తొమ్మిదిరోజుల పాటు ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న మహిళా క్రికెటర్లు... బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో సూపర్‌నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు మిథాలీరాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ సారథ్యం వహిస్తారు. మినీ ఐపీఎల్‌గా పరిగణించే ఈ టోర్నీతోనే భారత మíహిళా క్రికెటర్లు కరోనా విరామం తర్వాత తొలి సారి మళ్లీ బ్యాట్‌ పడుతున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు