ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం

27 Jun, 2021 16:06 IST|Sakshi

పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత మహిళల ఆర్చరీ బృందం ఆదివారం సత్తా చాటింది. ఆర్చరీ ప్రపంచకప్‌లో రికర్వ్‌ టీమ్‌ భారత్‌కు రెండో స్వర్ణం అందించింది. రికర్వ్‌ టీమ్‌లో దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్‌లతో కూడిన భారత ఆర్చరీ బృందం మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచింది.

కాగా ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత ఆర్చర్‌ అభిషేక్‌ వర్మ వ్యక్తిగత విభాగంలో శనివారం పసిడి పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వరల్డ్‌కప్‌ స్టేజ్‌–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్‌ పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్‌ షాఫ్‌ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్‌ వర్మ ‘షూట్‌ ఆఫ్‌’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన భారత్‌ బాక్సర్‌.. ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానం కైవసం

మరిన్ని వార్తలు