19 ఏళ్ల నిరీక్షణకు తెర...

18 Oct, 2021 05:43 IST|Sakshi

అర్హుస్‌ (డెన్మార్క్‌): థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల తర్వాత ఇండోనేసియా జట్టు మళ్లీ విజేతగా నిలిచింది. చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–0తో గెలిచి 14వసారి థామస్‌ కప్‌ను సొంతం చేసుకుంది. చివరిసారి ఇండోనేసియా జట్టు 2002లో ఈ మెగా ఈవెంట్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో జిన్‌టింగ్‌ 18–21, 21–14, 21–16తో లు గ్వాంగ్‌ జును ఓడించాడు. రెండో మ్యాచ్‌లో అల్ఫియాన్‌–అర్దియాంతో జోడీ 21–12, 21–19తో హిజి టింగ్‌–జౌ హావో డాంగ్‌ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్‌ క్రిస్టీ 21–14, 18–21, 21–14తో లి ఫి షెంగ్‌పై నెగ్గి ఇండోనేసియాకు విజయాన్ని ఖరారు చేశాడు. మరోవైపు ఉబెర్‌ కప్‌ మహిళల టీమ్‌ చాంపియన్‌íÙప్‌ ఫైనల్లో చైనా 3–1తో జపాన్‌ను ఓడించి 15వసారి చాంపియన్‌గా నిలిచింది.  

మరిన్ని వార్తలు