ముగిసిన భారత క్రీడాకారుల పోరాటం: లక్ష్య సేన్‌ ఓటమి.. అశ్విని–తనీషా కూడా ఇంటికే

28 Jan, 2023 10:30 IST|Sakshi
లక్ష్య సేన్‌ (PC: BAI Twitter)

ఇండోనేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌... మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఓడిపోయారు.

ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–15, 10–21, 13–21తో మూడో ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ తొలి గేమ్‌లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

అయితే క్రిస్టీ పుంజుకొని వరుసగా రెండు గేముల్లో గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో అశ్విని–తనీషా 13–21, 18–21తో యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్‌) చేతిలో ఓడిపోయారు.  

చదవండి: MS Dhoni: ఏ మాత్రం తగ్గని ధోని ​మేనియా
T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్‌ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్‌.

మరిన్ని వార్తలు