Indonesia Masters 2022: సింధు నిష్క్రమణ

11 Jun, 2022 05:23 IST|Sakshi

రచనోక్‌ చేతిలో తొమ్మిదోసారి ఓటమి

జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పీవీ సింధు, లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఏడో ర్యాంకర్‌ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది.

రచనోక్‌ చేతిలో సింధుకిది తొమ్మిదో ఓటమి. 2018 వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో చివరిసారి రచనోక్‌పై నెగ్గిన సింధు ఆ తర్వాత ఈ థాయ్‌ ప్లేయర్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 62 నిమిషాల్లో 16–21, 21–12, 14–21తో చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన సింధు, లక్ష్య సేన్‌లకు 2,160 డాలర్ల (రూ. లక్షా 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.

మరిన్ని వార్తలు