ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

26 Aug, 2023 17:21 IST|Sakshi

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అప్‌కమింగ్‌ పేస్‌ గన్‌ జోష్‌ టంగ్‌ గాయం బారిన పడి సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ టీమ్‌ సెలెక్టర్లు టంగ్‌ స్థానాన్ని వెటరన్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డన్‌తో భర్తీ చేశారు.

కాగా, యాషెస్‌-2023 సిరీస్‌కు ముందు జరిగిన ఐర్లాండ్‌ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల టంగ్‌.. ఐర్లాండ్‌ మ్యాచ్‌తో పాటు యాషెస్‌ సిరీస్‌లోని లార్డ్స్‌ టెస్ట్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో టంగ్‌ 25.7 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 5 వికెట్ల ఘనత కూడా ఉంది.

ఇదిలా ఉంటే, 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈనెల (ఆగస్ట్‌) 30న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లలో తొలుత టీ20 సిరీస్‌ (ఆగస్ట్‌ 30 నుంచి సప్టెంబర్‌ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్‌ జరుగుతుంది.

తొలి టీ20 ఆగస్ట్‌ 30న, రెండోది సెప్టెంబర్‌ 1న, మూడోది సెప్టెంబర్‌ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్‌ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్‌ 8న తొలి వన్డే, సెప్టెంబర్‌ 10న రెండో వన్డే, సెప్టెంబర్‌ 13న మూడో వన్డే, సెప్టెంబర్‌ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి.

న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ టీ20 జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, క్రిస్‌ జోర్డన్‌, ల్యూక్ వుడ్

మరిన్ని వార్తలు