IND vs BAN: ఆసుపత్రిలో చేరిన మహ్మద్ షమీ.. ఫొటోలు వైరల్

4 Dec, 2022 13:28 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా వెటరన్‌ పేసర్ మహ్మద్‌ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. బంగ్లా పర్యటనకు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా షమీ భుజానికి గాయమైంది. వన్డే సిరీస్ కోసం షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి బీసీసీఐ తీసుకుంది.

ప్రస్తుతం షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక తాజగా తన గాయానికి సంబంధించిన ఆప్‌డేట్‌ను షమీ అభిమానులతో పంచుకున్నాడు. "నా కెరీర్‌లో గాయాలు భాగమైపోయాయి. గాయమైన ప్రతిసారి నేర్చుకుని మరింత బలంగా తిరిగి వచ్చాను. గాయాలు మనకు కొత్త పాఠాలు నేర్పుతాయి.

ఈ సారి కూడా మరింత బలంగా తిరిగి వస్తాను" అని షమీ ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా షమీ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు  నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బంగ్లాతో టెస్టులకు కూడా షమీ దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్‌ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత్‌ టూర్‌ ప్రారంభమవుతోంది.

చదవండి: IND Vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్‌ బౌలర్‌.. బీసీసీఐ ప్రకటన

మరిన్ని వార్తలు