India Tour Of Zimbabwe: స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం..! 

15 Aug, 2022 08:15 IST|Sakshi

Washington Sundar Ruled Out Of Zimbabwe Tour: ఇంగ్లండ్‌లో దేశవాళీ మ్యాచ్‌లాడుతున్న భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడ్డాడు. దీంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ దేశవాళీ వన్డే టోర్నీ రాయల్‌ లండన్‌ కప్‌లో లాంకషైర్‌ తరఫున సుందర్‌ ఆడుతున్నాడు. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ పట్టేందుకు డైవ్‌ చేసినపుడు అతని ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానం వీడాడు.

తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి దిగలేదు. ఆదివారం హాంప్‌షైర్‌తో జరిగిన పోరులోనూ అతను బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతని గాయం తీవ్రమైంది అయితే జింబాబ్వే పర్యటనకు వెళ్లడు. అటునుంచి నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వచ్చి పునరావాస శిబిరంలో పాల్గొనే అవకాశముంది. ఈనెల 18 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ పాల్గొంటుంది.  

మరిన్ని వార్తలు