పాండ్యా, నటాషా ఫోటోను తొలగించిన ఇన్‌స్టాగ్రామ్‌

18 Aug, 2020 19:49 IST|Sakshi

ముంబై: క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముద్దు పెట్టుకున్న ఒక చిత్రాన్ని డాన్సర్- నటి నటాషా స్టాంకోవిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రం తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది అంటూ ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. మంగళవారం నటాషా అదే చిత్రాన్ని స్కీన్‌షాట్‌ తీసి మళ్లీ పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఫొటోను ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌ తొలగించలేదు. మొదటిసారి షేర్‌ చేసిన చిత్రం స్థానంలో ఫోటో స్థానంలో ‘మీ చిత్రం ఇన్‌స్టాగ్రామ్‌ కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్దంగా ఉంది కాబట్టి మీ పోస్ట్‌ను తొ​లగించాల్సి వచ్చింది’ అనే మెసేజ్‌ కనిపిస్తోంది.

మొదట పెట్టిన ఫోటోకు మిస్సింగ్‌ యూ హర్దిక్‌ పాండ్యా అనే కాప్షన్‌ పెట్టగా, రెండవసారి పెట్టిన పోస్ట్‌కు నటాషా ఏ శీర్షికను జోడించలేదు. ఇక ఆ ఫోటోకు హాహా ఐ లవ్‌ యూ అని హర్దిక్‌ పాండ్యా కామెంట్‌ పెట్టాడు. హార్ధిక్‌పాండ్యా, నటాషాకు ఇటీవల ఒక బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. వారిద్దరికి జూలై నెలలో దుబాయ్‌లో నిశ్చితార్థం జరిగింది. ఇక తను తండ్రిగా తన కొడుకుతో ఎంజాయ్‌ చేస్తున్నానని అందుకు సంబంధించిన అనేక విషయాలను పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. క్రికెట్‌ విషయానికి వస్తే సెప్టెంబర్‌లో దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్‌లో హార్ధిక్‌ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌ తరపున ఆడనున్నాడు. 

చదవండి: ఖేల్‌ రత్నకు రోహిత్‌ శర్మ నామినేట్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు