రష్యా, బెలారస్‌లను వెలివేయండి: ఐఓసీ

1 Mar, 2022 05:53 IST|Sakshi

లూసానే: అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్‌పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ‘ఇరు దేశాల్లో ఏ టోర్నీ నిర్వహించకుండా రద్దు చేయాలి. అథ్లెట్లు, అధికారులు ఇతర దేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధించాలి’ అని ఐఓసీ తెలిపింది. పోలాండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఇదివరకే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య  రష్యా, బెలారస్‌లకు కేటాయించిన  బ్యాడ్మింటన్‌ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్‌ సమాఖ్య ఈ ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ను రద్దు చేసింది.

మరిన్ని వార్తలు