FIFA WC Vs IPL 2022: షాకింగ్‌.. ఫిఫా వరల్డ్‌కప్‌ను దాటేసిన ఐపీఎల్‌

14 Apr, 2022 17:39 IST|Sakshi
Courtesy: IPL Twitter

ప్రపంచవ్యప్తంగా ఎక్కువగా అభిమానించే క్రీడల్లో ఫుట్‌బాల్‌ది మొదటిస్థానం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ ఫిఫా వరల్డ్‌కప్‌కు ఉండే క్రేజ్‌ వేరు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగాసమరాన్ని కోట్ల మంది వీక్షిస్తుంటారు. అయితే అలాంటి ఫుట్‌బాల్‌ను మన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఒక్క విషయంలో మాత్రం దాటేసి చరిత్రలో నిలిచింది. 

అదేంటో తెలుసా.. టికెట్ల విషయంలో. అవునండీ మన ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్లు ఫిఫా వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌ల టికెట్ల ధర కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖతార్‌ వేదికగా నవంబర్‌ 21 నుండి డిసెంబర్‌ 18 వరకు ఫిఫా వరల్డ్‌కప్‌ సమరం జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఏప్రిల్‌ 5 నుంచి ఏప్రిల్‌ 28 వరకు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే టికెట్‌ రేట్‌ విషయం కాస్త షాక్‌ కలిగించింది. ఉదాహరణకు స్పెయిన్‌- జర్మనీ మ్యాచ్‌ తీసుకుంటే  ఖతార్‌ కరెన్సీలో టికెట్‌ రేటు 250 ఖతార్‌ రియాల్‌గా ఉంది.(మన కరెన్సీలో దాదాపు రూ.5,211).. ఇది మన ఐపీఎల్‌ టికెట్‌ రేట్స్‌లో సగానికి సగం కావడం విశేషం. 

ఇక ప్రతిష్టాత్మక ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్‌ ధర రూ. 45,828.. మన ఐపీఎల్‌ టికెట్‌తో పోలిస్తే రూ.10వేల వ్యత్యాసం మాత్రమే ఉంది. మరి మన ఐపీఎల్‌ ఫైనల్‌ టికెట్‌ రేట్‌ ఎంతో మీ ఊహకే వదిలేస్తున్నాం. వాస్తవానికి దీనికి ఒక కారణం ఉంది. నాలుగేళ్లకోసారి మాత్రమే  ఫిఫా వరల్డ్‌కప్‌ జరుగుతుంది.. కానీ ఐపీఎల్‌ ప్రతీఏడాది కచ్చితంగా నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లక్రితం ఉన్న రేట్లకు డబుల్‌ రేట్లు ఫిక్స్‌ చేసి ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌ టికెట్ల రేట్లను నిర్ణయించారు.

అందుకే మన ఐపీఎల్‌ టికెట్‌ రేట్లతో పోలిస్తే అవి తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో ఆశ్చర్యకర విషయమేంటంటే.. భారత్‌లో ఎక్కువగా అభిమానించేది క్రికెట్‌.. కానీ ఈసారి ఖతార్‌ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల కోసం భారతీయులు కూడా ఎగబడ్డారు. అత్యధిక టికెట్స్‌ అప్లై చేసుకున్న టాప్‌-7 దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉండడం విశేషం.

చదవండి: CSK VS RCB: ఈ సీజన్‌ అత్యధిక వ్యూయర్షిప్‌ రికార్డైంది ఈ మ్యాచ్‌లోనే..!

మరిన్ని వార్తలు